నవతెలంగాణ-అచ్చంపేట
పోస్టాఫీస్ లో 18 ఏళ్ల లోపు బాలుర (మగ పిల్లల) కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా అందుబాటులో ఉందని పోస్ట్ మాస్టర్ శ్రీకాంత్ తెలిపారు. పిల్లల, తల్లిదండ్రుల ఆధార్ కార్డులతో పాటు రూ.500 చెల్లించి ఈ ఖాతా తెరవవచ్చన్నారు. ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చని, దీనిపై చక్రవడ్డీ లభిస్తుందని పేర్కొన్నారు. బాలికల పేరుతో సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఏ విధంగా ఉంటుందో.. అదేవిధంగా మగ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పిపిఎఫ్ ఖాతాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఉన్నత చదువులకు ఈ ఖాతాలో పొదుపు చేసిన డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బాలల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన సూచించారు. వివరాలకు స్థానిక పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించాలన్నారు.
పోస్టాఫీస్ లో మగ పిల్లల కోసం ప్రత్యేక పథకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



