Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ : యువతకు ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆలేర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బి ఎల్ ఏ ల శిక్షణ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో దశా దిశా మార్చేది, రాహుల్ గాంధీ అన్నారు. యువత కష్టపడి తల్లిదండ్రులు చవిపించి , ఎన్నో రకాల ఎగ్జామ్స్ రాయిస్తూ భవిష్యత్తు నిర్మించుకుంటారన్నారు. నీట్ రద్దుతో బిజెపి మోడీ సర్కారు పేదల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడు అన్నారు. యువత పక్షాన కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. అధైర్య పడవద్దు అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజస్థాన్ కోటలో అక్కడ వేల మంది యువత , రాహుల్ గాంధీ ఇన్వైట్ చేసి, యువత, విద్యార్థుల భవిష్యత్ కోసం మరొక్కసారి భరోసా ఇచ్చారన్నారు.రాహుల్ గాంధీ సందేశం విని, తెలంగాణలో ప్రతి పౌరుడు తన గొంతు విప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా యువత సమావేశం 26 తేదీన యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, సేవాదళ్,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. యువత హాజరై విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ,వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు ,సోషల్ మీడియాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసారపు యాదగిరి, నాయకులు గంధ మల్ల అశోక్, ఎంఏ ఎజాస్ ,బీజన భాస్కర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -