Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ ఇంటింటి సర్వేను పరిశీలించిన తహశీల్దార్

ఎస్ఐఆర్ ఇంటింటి సర్వేను పరిశీలించిన తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
ప్రత్యేక హోటల్లో సవరణలో భాగంగా నవాబు పేట మండలం లోని లింగం పల్లి గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటి సర్వే ను ఏఈఆర్ఓ తహశీల్దార్ సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఓటర్ ఎస్ ఐ ఆర్ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఫారం నింపేందుకు బీఎల్ఓలకు ఆయా పార్టీల బీఎల్ఏలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటర్లు తమ అనుమానాలను ఓటర్ జాబితా పై అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటర్లు జాబితాలో ఉంటాయని బీఎల్ఏ లు సహాకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి స్వేత, జీపీఓ అనిత, ఎన్యుమరేటర్లు చంద్రకళ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -