మండల ప్రత్యేక అధికారి శంకర్
నవతెలంగాణ- కుభీర్
అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి కట్టుగా పని చేసి మండలన్ని అభివృద్ది పధంలో నడిపించాలని మండల ప్రత్యేక అధికారి శంకర్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన కుభీర్ రైతు వేదికలో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన 99రోజుల ప్రజాపాలనా-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు 90% పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. అనంతరం డాక్టర్ విజేష్ మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటి వరకు 25 శాతం హెచ్ పి వి వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పై గ్రామాలలో అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రోత్సహించాలన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో ఫెర్టిలైజర్ యాప్ ను పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని సూచించారు. యూరియా వాడకుండా నానో యూరియాను అధిక మొత్తంలో వాడేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు వారి వారి ప్రగతి నివేదికలను ప్రజా ప్రతినిధుల ముందర చదివి వినిపించారు.
నీటిపారుదల అధికారులపై తీవ్రంగా మండిపడ్డ ప్రజాప్రతినిధులు
వేసవి కాలం దృష్ర్ట్యా గ్రామాల్లో మంచి నీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజా ప్రతినిధులకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ బి సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో మిషన్ భగీరథ పనులు కేవలం 30 శాతం మాత్రమే పూర్తిచేసి చేతులు దులుపుకునరాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు నీటి సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఉద్దేశంతో గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నుంచి బోర్లను లీజుకు తీసుకొని త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఎన్నో సమావేశాలలో గ్రామాల్లో తాగునీటి సమస్య విన్నవించిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా నీటిపారుదల శాఖ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. మిషన్ భగీరథ పనితీరు సక్రమంగా లేదని తీరు మార్చుకోవాలని పైసా ఆత్మ కమిటీ చైర్మన్ వివేకానంద సూచించారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. పలుమార్లు ఫోన్ చేసిన నీటిపారుదల శాఖ అధికారులు ఫోన్ చేస్తే స్పందించడం లేదని సభా దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చర్మన్ కళ్యణ్, ఆత్మకమైటి చర్మన్ వివేకానంద,ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి, తహసీల్దార్ శివరాజ్, మండల విద్య అధికారి విజయ్ కుమార్ కుబీర్ ఎస్సై శ్రీనివాస్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మారుతి, సాయినాథ్ ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


