జిల్లా డిఆర్డిఓ నాగిరెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆరుకాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకూడదని జిల్లా డిఆర్డిఓ నాగిరెడ్డి సూచించారు. గురువారం ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా మంచినీళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. గన్ని బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కేంద్రాలకు తీసుకు వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంతి మధు, ఏఎంసీ డైరెక్టర్ కిష్టయ్య, ఏపీఎం సత్యనారాయణ, సీసీ సరస్వతి, మండల పార్టీ అధ్యక్షుడు కొండ్రోజు వెంకటేశ్వరరాజు, టెక్నికల్ అసిస్టెంట్ చారి, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు మమత, ఉప సర్పంచ్ శ్రీధర్, వార్డు సభ్యులు నాగరాజు, శ్రీను, నరేష్, బాలరాజు, సి సి ఆనంద్, ఏఈఓ భార్గవి, గ్రామ శాఖ అధ్యక్షులు చిల్కు నాగరాజు, రమ, శ్రీలత, రామ్ నర్సయ్య, సరిత, భాగ్య, సాఫియా, రాణి, శైలజ తదితరులు పాల్గొన్నారు.



