- Advertisement -
ఆలయానికి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వితరణ
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని నడిమి తండా పంచాయతీ పాలకవర్గం తమ గ్రామములో ప్లాస్టిక్ నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అందరు కలిసి తీర్మానం చేశారు. ఇకపై గ్రామములో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు వాడకుండా ఉండాలని, దానివల్ల ఆరోగ్యాలకు హానికరం అని గ్రామస్థులకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామప్రజలకు అవగాహణ కల్పించారు. అనంతరం గ్రామములోని జగదాంబ ఆలయానికి 200 స్టీల్ ప్లేట్స్, 100 గ్లాసులు వితరణ చేశారు. కార్యక్రమం క్రమములో సర్పంచ్ ధరవాత కెలు, ఉపసర్పంచ్ బాణావత్ సతీష్, వార్డు సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



