Saturday, April 18, 2026
E-PAPER
Homeకరీంనగర్మద్యం సేవించిన 18 మందికి జైలు శిక్ష

మద్యం సేవించిన 18 మందికి జైలు శిక్ష

- Advertisement -

జిల్లా ఎస్పీ మహేష్ బి. గిత
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 20 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని పోలీసులు శనివారం సిరిసిల్ల కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ప్రవీణ్ జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. 9 మందికి ఒకరోజు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.4000 జరిమానా, ఏడు మందికి రెండు రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.5000 జరిమానా, ఇద్దరికీ మూడు రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.5000 జరిమానా, ఇద్దరిలో ఒక్కొక్కరికి పదివేల జరిమానలను న్యాయమూర్తి విధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురై కుటుంబాలను రోడ్డున పడేయొద్దని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల తమతో పాటు ఎదురుగా వచ్చే వారి కుటుంబాల్లో కూడా విషాదం నింపవద్దని హెచ్చరించారు.మద్యం సేవించి కేసుల పలు అయితే  భవిష్యత్తులో ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని, పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరించారు.అలాగే ట్రాఫిక్ మరియు రోడ్ భద్రత నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు,వాహన తనిఖీలు నిర్వహించాడం జరిగుతుందని,మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -