నవతెలంగాణ – అశ్వారావుపేట
సత్తుపల్లి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు జన్మదిన వేడుకలను అశ్వారావుపేట లో శనివారం సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట లోని అమ్మ సేవా సదన్ (వృద్ధాశ్రమం)లో జలగం యువసేన నాయకులు చిక్కం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, వృద్ధాశ్రమం లోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సేవా భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోటగిరి మోహన్ రావు, వేముల ప్రకాష్, కొటారు చలపతిరావు, ఆరేపల్లి వెంకటేశ్వరరావు, పల్లపు శ్రీరామ్మూర్తి, ఆరేపల్లి కిరణ్ కుమార్ గౌడ్, భూక్య శ్రీను, వేముల పండు, నారాయణ, ప్రసాదు, బండి రామకృష్ణ, నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించారని పలువురు అభిప్రాయపడ్డారు.



