నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో ఈనెల 14న రాత్రి సుంకర జయపాలను హత్య చేసిన నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్టు ఎస్సిహెచ్ఓ పి సత్యనారాయణ శనివారం తెలిపారు. ఆమె ఇంటి ఎదురుగా కిరాయికి ఉండే ఆలూరు గ్రామానికి చెందిన గోసంగి కులస్తులైన మల్లేష్ , అతని భార్య పోశవ్వ ఇద్దరు కలిసి ఆమెతో స్నేహంగా ఉండేవారని, బంగారు నగలు దొంగిలించాలని ఉద్దేశంతో ఆమె ముఖంపై దిండు పెట్టి వత్తి గొంతు పిసికి చంపేసినారని తెలిపారు. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, చెవుల కమ్మలు ,మాటీలు ముక్కుపుడక, వెండి పట్టీలు, మెట్టెలు బీరువాలో ఉన్న రోల్డ్ గోల్డ్ తీగ, గాజులు చైన్ దొంగలించినారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వారిద్దరిని పట్టణంలోని వడ్డెర కాలనీ సంతోష్ నగర్ లో పట్టుకొని వారి వద్ద నుండి రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.
మహిళను హత్య చేసిన నిందితులకు రిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



