Saturday, April 18, 2026
E-PAPER
Homeఖమ్మంసోమవారం రెండో విడత రైతు భరోసా విడుదల 

సోమవారం రెండో విడత రైతు భరోసా విడుదల 

- Advertisement -

– భూపాలపల్లి లో లాంచనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 
– రైతు నేస్తం ప్రసారం సోమవారానికి మార్పు 
– ఏడీఏ పెంటేల రవి కుమార్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

రైతు భరోసా యాసంగి 2025 – 26 రెండవ విడత నిధులను సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తుర్పల్లి లో విడుదల చేయనున్న దృష్ట్యా మంగళవారం నిర్వహించే రైతు నేస్తం ప్రసారంను సోమవారంకు మార్చినట్లు వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ శనివారం ప్రకటించారు.

మధ్యాహ్నం 3 గంటలకు రైతు నేస్తం మొదలు అవుతుందని అన్నారు. రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు అందరూ సోమవారం మధ్యాహ్నం 2 గంటల లోపు లాగిన్ అవ్వాలని కోరారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు అందరూ సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల లోపు తప్పనిసరిగా లాగిన్ అవ్వాలని కోరారు.

ఏఈఓ లు అందరూ ప్రతి రైతు వేదికలో కనీసం 200 మంది రైతులను సమీకరించాలని, ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తయ్యే వరకు రైతులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని అన్నారు. ఏఈఓ లు అందరూ ఈ కార్యక్రమం కోసం తమ పరిధిలోని ఎంపిక చేసిన నేల ఆరోగ్య వాలంటీర్లను కూడా సమీకరించాలని మరియు కార్యక్రమంలో పాల్గొనేలా కూడా నిర్ధారించుకోవాలి అని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -