- Advertisement -
- రైతులకు పోలీసుల హెచ్చరిక
- నవతెలంగాణ-రాయికల్
- మండలంలోని బోర్నపల్లి గ్రామంలో గోదావరి బ్రిడ్జిపై, ప్రధాన రహదారిపై గానీ మొక్కజొన్న కంకులు, మక్కలు, వడ్లు తదితర పంటలను ఆరబెట్టరాదని పోలీసు అధికారులు రైతులకు హెచ్చరించారు. ఈ మేరకు రాయికల్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ రమణ,ఆర్ అండ్ బి ఏఈ బి. సంజయ్ రైతులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు.
- రోడ్లపై పంటలు ఆరబెట్టడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ కొంతమంది రైతులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరు నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడిపెల్లి రాజవ్వ, ఉపసర్పంచ్ భూమేష్, నాయకులు ఆంజనేయులు, రాజు, రైతులు కిరణ్, భూమేష్, తేజ, రాహుల్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



