Sunday, April 19, 2026
E-PAPER
Homeకరీంనగర్ఒక్కరోజు సమ్మె విజయవంతం చేయాలి

ఒక్కరోజు సమ్మె విజయవంతం చేయాలి

- Advertisement -

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

ఈనెల 20న జరిగే పవర్ లూమ్ వార్పిన్, వై పని, ఆ సాములు, కార్మికులు చేపట్టే ఒక్కరోజు సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపు నిచ్చారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తంగళ్ళపల్లి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఏప్రిల్ 20న  తలపెట్టిన ఒకరోజు పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బందు , దీక్ష  పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పాలిస్టర్ కూలి పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.యజమానులు కార్మికులకు,ఆసాములకు కూలీ పెంచకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఇప్పటికీ అగ్రిమెంట్ అయిపోయి రెండు సంవత్సరాలు గడిచిన యజమానులు కూలి పెంచకుండా కార్మికులకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్డాస్ గణేష్ , పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తంగళ్ళపల్లి అధ్యక్షులు కుడిక్యాల కనుకయ్య , సామల నర్సయ్య , అవధూత హరిదాసు , సామల విష్ణు , రాంనారాయణ , శ్రీశైలం , ప్రకాష్ , రమేష్ , అశోక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -