Sunday, April 19, 2026
E-PAPER
Homeమానవిపిల్లలకు ఆకర్షణీయంగా ఉండాలి

పిల్లలకు ఆకర్షణీయంగా ఉండాలి

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా? వేతనం పెరిగిందని చెప్పావు చాలా సంతోషం. పైగా నీ పనితీరు, ప్రవర్తన వల్లనే వేతనం పెంచుతున్నట్టు నీపై అధికారులు లేఖలో పేర్కొనడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఎప్పుడు ఇలాగే కష్టపడి పనిచేస్తూ, సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ మంచిపేరు తెచ్చుకోగలవు. నీకు మా అభినందనలు, ఆశీస్సులు.
నాన్న… కిందటి ఉత్తరాల్లో పిల్లల పెంపకం, తీసుకోవలసిన జాగ్రత్తలు, మొదలైన విషయాలు చెప్పాను. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. చిన్న పిల్లల్లో ప్రతి దశ కీలకమైనదే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారికి అన్నం కొంచం మెత్తగా వండాలి, తప్పనిసరిగా పప్పు, నెయ్యి వేసి తినిపించాలి. కొంచం పెద్ద అవుతున్న కొద్దీ వాళ్లకు బలమైన, ఘన పదార్ధాలు తినిపించాలి. అన్ని రకాల కూరగాయలు తినటం అలవాటు చేయాలి. ఉదాహరణకు కొన్ని కూరలు, పళ్ళు తినరు. అటువంటప్పుడు నెమ్మదిగా మాటలు చెప్తూ, బొమ్మలు చూపిస్తూ తినిపించాలి. అప్పుడు కూడా తినటానికి ఇష్ట పడకపోతే, ఆకర్షణీయంగా వండిపెట్టాలి.
నీకు టిఫిన్‌ బాక్సులో ఇడ్లి, దోస లాంటివి పెడితే ఒక్కోసారి తినేదానివి కాదు. అప్పుడు నేను పాలకూర, క్యారెట్‌ లాంటివి వేసి చేసేదాన్ని. అపుడు తినేదానివి. అన్నం కూడా పెరుగన్నం తినేదానివి కాదు. దాంట్లో పల్లీలు, కొత్తిమీర, చిన్నగా తరిగిన అల్లముక్కలు వేసి ఎక్కువ పోపు వేసి ఇచ్చేదాన్ని. పోపుదినుసులు, కొత్తిమీర ఇవి ఆకర్షణీయంగా కనిపించి ఇష్టంగా తినేదానివి. అలాగే నెమ్మదిగా పిల్లలకు అన్నీ తినటం అలవాటు చేయాలి. అప్పుడు ఎక్కడికి వెళ్లినా, ఎవరింటికి వెళ్లినా ఇబ్బంది ఉండదు.
అయితే ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యమైన విషయం పిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్పాలి, ఎవరు ఏది ఇచ్చినా తీసుకోవద్దు, తినొద్దు. ఎందుకంటే ఎప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒక్కోసారి అపరిచితులు, పిల్లలను ఎత్తుకెళ్లే వాళ్ళు ఉంటారు. సరే నాన్న ఉంటాను. బలమైన ఆహారం తీసుకుంటూ, ద్రవ పదార్ధాలు ఎక్కువ తీసుకుంటూ ఉండూ…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -