ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. నైన్టీస్ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫా ర్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈనెల 11న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో పలు ఆసక్తికర విశేషాలను షేర్ చేసుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఒక వేడు కలో చెప్పినట్లు, ‘మామూలు కథ చెప్పాలి. కానీ, బలంగా చెప్పాలి. ట్విస్ట్ లు, రక్తపాతాలు లేకుండా ఒక మంచి కథ చెప్పాలి’.. అలా తీసిన ప్రేమ కథే ఈ సినిమా. వనపర్తికి చెందిన ఒక సాధారణ కుర్రాడు, తన ప్యాషన్ ను పక్కన పెట్టి, తల్లిదండ్రుల కోసం విదేశా లకు వెళ్తాడు. అక్కడ నుంచి అతను జీవితాన్ని చూసే కోణం ఎలా మారు తుంది?, అక్కడ ఒకమ్మాయిని ప్రేమించి, లివిన్ రిలేషన్ లో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవు తాయి? అనేది సహజంగా చూపిం చాము. లివిన్ రిలేషన్ కాన్సెప్ట్ అయినప్పటికీ, కుటుంబ ప్రేక్ష కులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా దర్శకుడు ఆదిత్య ఎంతో అందంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు.
ఈ సినిమాపై టీమ్ అంతా మొదటి నుంచి ఎంతో నమ్మకంగా ఉన్నాం. అన్ని జనరేషన్ల వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారికి మాత్రమే కాకుండా, కుటుంబానికి దూరంగా ఉండే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఒక మధ్య తరగతి యువకుడి జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగం గురించి, ప్రేమ గురించి, కుటుంబ బాధ్యతల గురించి ఇలా ఎన్నో అంశాలను సహజంగా, అందంగా చూపించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి కథ. నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటలను మనం ఎదురుగా అద్దంలో చూసుకుంటే ఎలా ఉం టుందో ఈ సినిమా అలా ఉం టుంది. ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు. ఒక అందమైన జర్నీలా ఉంటుంది.
‘ఎపిక్’ఓ అందమైన ప్రయాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



