నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం జంతు సంక్షేమానికి, ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు రెండో బోర్డు తొలి సమావేశం మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాట్ల నివారణ, ప్రజా భద్రత, జంతు సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. ఏబీసీ రూల్స్ 2023 అమలు, ఏబీసీ కేంద్రాల బలోపేత, ప్రమాదకర కుక్కల నిర్వహణ, జంతు సంరక్షణ కేంద్రాలు, అత్యవసర పశువైద్య సేవలను మెరుగుపరచడంపై చర్చించారు. చిన్నారులు, ప్రజలు, రహదారి భద్రతతో పాటు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో జంతువుల పట్ల చట్టబద్ధమైన, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, విద్య, పోలీస్ శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె.ఇలంబర్తి, వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి.గోపి, సమావేశంలో జయేష్ రంజన్ IAS, డా. కె. ఇలంబర్తి IAS, డా. బి. గోపీ IAS, పీవీ నర్సిహారావు వెటర్నిటీ యూనివర్సీటీ వీసీ ప్రొఫెసర్ జ్ఞానప్రకాశ్, సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) క్షితిజ, జీహెచ్‌ఎంసీ, సీఎమ్‌సీ, ఎమ్‌ఎమ్‌సీ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
జంతు సంక్షేమం, ప్రజా భద్రతకు ప్రాధాన్యత: మంత్రి వాకిటి శ్రీహరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



