నవతెలంగాణ -పెద్దవూర
అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూరమండలం చలకుర్తి సెక్టార్ ఊరబావి తండాఅంగన్వాడీ కేంద్రం లో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమాలను సీడీపీఓ విజయ లక్ష్మి సిబ్బందితో ఘనంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు చిరుదాన్యాలతో తయారు చేసిన వివిధ వంటకాలు, పదార్దాల తయారు చేసులకోని వచ్చారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ .. పిల్లల శారీరక, మానసిక, భాషా సామాజిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన దశలను వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా తల్లిపాలు, సమయానుకూలంగా ఇచ్చే సప్లిమెంటరీ ఆహారం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల ఎదుగుదల మరింత మెరుగు పడుతుందని తెలిపారు. బాల్యవివాహాలను అరికట్టాలని,అమ్మాయి లకు 18 సంవత్సరాల నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయ్యాలి అని, ఫోక్స్ చట్టం గురించి, సైబర్ బుల్లింగ్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ సువర్ణ, సూపర్ వైజర్ గౌసియా బేగం,అంగన్వాడీ టీచర్లు,చిన్నారులు లబ్ధిదారులు పాల్గోన్నారు.



