Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోతునూరులో దోమల మందు పిచికారీ

పోతునూరులో దోమల మందు పిచికారీ

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవూర
మండలంలోని పోతునూరు గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టడానికి సర్పంచ్ పెండ్యాల సంతోష్ రావు గ్రామం లో ప్రతి వీధి, ప్రతి వార్డులో దోమల మందును పిచికారీ చేయిస్తున్నారు. గ్రామం లో కాలువలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల మందును  ఫాగింగ్ యంత్రాల ద్వారా వదులు తున్నారు. ముఖ్యంగా వర్షాకాలానికి ముందు, తర్వాత దోమలనివారణకుపిచికారీ చేస్తున్నారు.ఈసందర్బంగా సర్పంచ్ సంతోష్ రావు మాట్లాడుతూ  మందు పిచికారీ చేసేటప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం ద్వారా లోపల ఉన్న దోమలను నివారించవచ్చని తెలిపారు.అలాగే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు.ఎండ కాలం లో గ్రామ పంచాయతీ లోని పోతునూరు,ఏనేమీది గూడెం,పోలేపల్లి గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాదులు మలేరియా,డెంగ్యూ వంటి జ్వరాలు రాకుండా దోమల మందు పిచికారీ చేస్తున్నామని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -