భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటి స్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో సిని మాపై అంచనాలను పెంచాయి. ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ,’ ప్రపం చంపై చీకటి కమ్ముకున్న సమ యంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్ష కులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు.’మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘త్రికాల’ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చు తుందనే నమ్మకంతో ఉన్నాం` అని నిర్మాతలు చెప్పారు.



