‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్ర బృందం తాజాగా రెండవ గీతం ‘ప్రియసఖి’ని విడుదల చేసింది. ప్రేమ అనే భావన చుట్టూ అల్లుకున్న ఈ పాట, ఒక యువకుడు తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మనసులో దాచుకున్న మౌన భావాలను, ఆరాధనను, అనురాగాన్ని అందంగా ఆవిష్కరించింది. సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు. కె.ఎస్.హరిశంకర్ ఈ పాట అలపించారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వర పరిచిన ఈ పాట ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తూనే, తెలియని భావోద్వేగాన్ని మిగులుస్తుంది అని మేకర్స్ తెలిపారు. 'నైన్టీస్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకొని, వెండితెరకు దర్శ కుడిగా పరిచయమవుతున్న ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా జూలైలో థియేటర్లలో అడుగు పెట్టనుంది.
‘జీవితాన్నే మార్చేశావే..
- Advertisement -
- Advertisement -



