రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో సాయికిరణ్, జోగిని శ్యామల ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెవరు?`. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన సందేశభరిత వినోదాత్మక చిత్రమిది. ఈ సినిమా ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండగా, కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా “నేనెవరు?” అనే టైటిల్‌కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్, రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని తెలిపారు. టెక్నికల్‌గా కూడా సినిమా మంచి స్థాయిలో రూపొందిందని, సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక బలంగా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రివ్యూ షోల అనంతరం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం విడుదల రోజున మంచి స్పందన అందుకుంటుందని భావిస్తున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.
వినోదం + సందేశం = నేనెవరు?
- Advertisement -
- Advertisement -



