- Advertisement -
నవతెలంగాణ – ఘట్‌కేసర్: తన కొడుకును ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే కారణంతో తోడి కోడలి కుమారుడి (4)పై దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



