Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సి కాలనీలో బోరు మోటర్ ప్రారంభం

ఎస్సి కాలనీలో బోరు మోటర్ ప్రారంభం

- Advertisement -

– కాలనీలో తీరిన నీటి కష్టాలు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామంలోని ఎస్సి కాలనిలో గత కొంతకాలంగా నెలకొన్న నీటి ఇబ్బందులు తొలగిపోయాయి.ఈ  మేరకు బుధవారం సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ నూతనంగా వేసిన బోరు బావిలో బిగించిన మోటర్ ను ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో గత కొంతకాలంగా రెండు బోరుబావులు పాడై,వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారడంతో కాలనీవాసులు  తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విషయాన్ని కాలనీవాసులు  సర్పంచ్ శైలేందర్ దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే స్పందించి ఎస్సి కాలనీలో ఇటీవల బోర్ వేయించారు. అట్టి బోరు బావిలో మోటార్ బిగించడంతో దానిని ప్రత్యేక పూజలు నిర్వహించి, సర్పంచ్ శైలేందర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం చేసినందుకు గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్ లకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

 అలాగే ఈ నీటి సమస్య పరిష్కారం కోసం ఎంతో బాధ్యతాయుతంగా ముందుండి నడిపించిన మా వార్డ్ మెంబెర్ దాసరి రాకేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు, ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రాకేష్, సంతోష్, అజయ్, సాదుల్లా, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వన్నెల రాజేశ్వర్, మారుపక నరేష్, సల్మాన్, ఉబేద్, ఎస్సీ సంఘ సభ్యులు బండి ఆంజనేయులు, సదానంద్, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -