Monday, July 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు

విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని అంతర్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయుడిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి గానీ ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోందని సివైఎస్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కు సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టీచర్, ఎంఈఓపై కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని, లేనియెడల నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ.. ఫిర్యాదుపై వెంటనే విచారణ ఆదేశాలు జారీ చేశామనీ, నివేదికలు అందిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -