మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం.. విచారణ జూన్ 6కు వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన కేసులో ఫిరాయింపుదారులుగా చెబు తున్న వాళ్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపుదారులు కాదంటూ స్పీకర్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులో తెలిపింది. ఆ తర్వాత కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిం చింది. విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ తరఫున ఎంపికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్, కడియం, శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకటరావు, సంజరుకుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.జగదీశ్‌రెడ్డి, కె.పి.వివేకానంద, కె.సంజరు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్.ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ అసెంబ్లీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు వేశారు. వీటిని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ గురువారం విచారించింది.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



