Saturday, September 19, 2026
E-PAPER
Homeజిల్లాలు"చేయూత"కు ఒక్కరోజే గడువు

“చేయూత”కు ఒక్కరోజే గడువు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు ముగిసేందుకు ఇంకా ఒక్క రోజే మిలిగి ఉంది. దరఖాస్తులకు ఈనెల 31ని చివరి తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్నందున అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు కలిపి మొత్తం 385 దరఖాస్తులు అందాయి. అధికారులు వీటిని పరిశీలించి ఆన్లైన్ చేస్తున్నారు. ప్రభుత్వం దరఖాస్తు గడువు తేదీని పెంచుతుందా లేదా అనే దానిపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -