Thursday, April 16, 2026
E-PAPER
Homeవరంగల్ఎన్‌యూజే(ఐ) జాతీయ మహాసభలకు పోస్టర్ ఆవిష్కరణ

ఎన్‌యూజే(ఐ) జాతీయ మహాసభలకు పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు జాతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండలం ధన్వాడలో బుధవారం నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) [ఎన్‌యూజే(ఐ)] ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ మహాసభల వాల్ పోస్టర్‌ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు ప్రతినిధులను ఒక వేదికపైకి తీసుకువచ్చే ఈ మహాసభలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలు, మీడియా రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇలాంటి ప్రతిష్టాత్మక సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని ఆయన అన్నారు.
టీఎస్‌జేయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర మరియు జిల్లా కమిటీలకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌జేయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తడుక సుధాకర్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు అరిగేల జనార్ధన్, గట్టు రవీందర్, ధన్వాడ సర్పంచ్ చీటూరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -