12 ఏండ్ల పాలనలో చేసింది శూన్యం
ఇక నుంచి సీపీఐ మిలిటెంట్ పోరాటాలు
ప్రజా వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 28న
చలో ఢిల్లీ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-మహబూబాబాద్
మోడీ విధానాలు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాయని, 12 ఏండ్ల బీజేనీ పాలనలో మోడీ చేసింది శూన్యం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 28న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం వీరభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నారని, కానీ రాష్ట్రాల మీద ప్రేమతో కాదన్నారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తున్నారని, మొన్న బీహార్‌లో నితీష్ కుమార్‌ను, ఇప్పుడు తృణముల్ కాంగ్రెస్‌ను దెబ్బతీశారని తెలిపారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సవ్యంగా సాగడం లేదన్నారు. ఇక నుంచి సీపీఐ మిలిటెంట్ పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం సీపీఐ పని చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, జిల్లా సహాయ కార్యదర్శులు బి. అజయ్ సారధిరెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, 18 వ వార్డు కౌన్సిలర్ రేశపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



