మక్తల్‌లో అఖిల భారత ఐక్య రైతు సంఘం ధర్నా
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ -మక్తల్
రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం అధ్యక్షులు సిఆర్.భగవంతు పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందడం లేదన్నారు. వ్యవసాయ ఉత్పాదకాల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో రైతులపై భారం పెరుగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు సంవత్సరానికి 200 రోజుల ఉపాధి, రోజుకు రూ.700 కూలిని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయలు శ్రామిక ప్రజల అవసరాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ ఆర్‌ఈజీఏ) అమలును బలహీనపరుస్తోందని ఆరోపించారు. భూమి లేని వారికి భూమి, ఇల్లు లేని వారికి ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులకు పూర్తి రుణమాఫీ కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ఇండో-అమెరికన్ వాణిజ్య ఒప్పందాల ద్వారా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆనంద్, వెంకటేష్, తిమ్మరాజు, నరసమ్మ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



