Tuesday, July 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు సమస్యలపై పోరాటాలకు శ్రీకారం

రైతు సమస్యలపై పోరాటాలకు శ్రీకారం

- Advertisement -

​ అన్నారం గ్రామంలో రైతులతో
 జూలకంటి రంగారెడ్డి
మహాసభ విజయవంతానికి విరాళాల సేకరణ
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్

​ నవంబర్ మాసంలో మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు సంఘం జాతీయ మహాసభ జరగనుందని, దానికి రైతాంగం ఆర్థిక, హార్థిక సహకారం అందించి విజయవంతం చేయాలని సంఘం జాతీయ నాయకులు, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో పొలాల్లో నాట్లు వేస్తున్న రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని రైతులను కలిసి మహాసభకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టించి పని చేసిన రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు లేనిది అభివృద్ధి జరగదని మాయ మాటలు తప్ప వారికి పెన్షన్, భరోసా సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ మహాసభలో చర్చించి పలు తీర్మానాలు చేసి సమరశీల పోరాటాలకు సమాయత్తం చేయనున్నట్టు తెలిపారు. రైతులు తమకు తోచిన విధంగా సహకరించి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. అన్నారం గ్రామం నుంచి కాంతారెడ్డి ఉమాకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కోటిరెడ్డి, కోటిరెడ్డి, బెనర్జి, కన్యానాయక్, తదితర రైతులు ఆర్థిక సహకారమందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు డబ్బికార్‌ ‌మల్లేశ్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు మంగారెడ్డి, మండల కార్యదర్శి రవినాయక్, నాయకులు అప్పారావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -