Magazines

మ‌ద‌ర్ ఆఫ్ డెమోక్ర‌సీ...

5 రోజుల క్రితం

Mother of Democracy...
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

ఏలిన‌వారు చెప్పే మాట‌ల‌కు.. వారి చేత‌ల‌కు పొంత‌న లేకుండా పోతున్న‌ది. అనునిత్యం దేశ‌భ‌క్తి గురించి మాట్లాడే వారికి ఇప్పుడు అదే దేశం గురించి మాట్లాడినా, దేశ ప్ర‌జ‌ల గురించి మాట్లాడినా, వారి హ‌క్కుల‌పై ప్ర‌శ్నించినా విప‌రీత‌మైన కోపం వ‌స్తోంది. స‌ర్ ప్ర‌క్రియ‌ను వ్య‌తిరేకిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల‌నే డిమాండ్ల‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు ఊపందుకున్న వేళ‌... వాట‌న్నింటినీ ఉక్కుపాదంతో అణ‌చివేస్తున్న ప్ర‌భుత్వ పెద్ద‌లు.. మ‌రో ప‌క్క ఇండియా ఈజ్ మ‌ద‌ర్ ఆఫ్ డెమోక్ర‌సీ అంటూ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలివ్వ‌టం అత్యంత విడ్డూరంగా మారింది. గాంధీ గారిని చంపిన వ్య‌క్తిని ఒక‌వైపు ఆరాధిస్తూనే.. మ‌రోవైపు అదే జాతిపిత‌కు దండేసి దండం పెట్ట‌టం.. హంత‌కుడే నివాళుల‌ర్పించిన చందంగా క‌న‌బ‌డుతోంది. చెడు విన‌కు, చెడు క‌న‌కు, చెడు మాట్లాడ‌కు అనే మ‌హాత్మాగాంధీ సూత్రాల‌ను... ఇప్పుడు తిర‌గేసి, మ‌ర‌గేసి... హ‌క్కుల గురించి విన‌కు, స్వేచ్ఛ గురించి చేప‌ట్టే ఆందోళ‌న‌ల‌ను క‌న‌కు, ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడ‌కు... అనే ప‌ద్ధ‌తుల్లో ఆ ప‌రివారం వ‌ల్లె వేస్తోంది. ఇదే 56 అంగుళాల ఛాతిగ‌ల పెద్దాయ‌న... గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు, ఆనాటి ప్ర‌ధాన ఎన్నికల క‌మిష‌న‌ర్ జేఎన్ లింగ్డోను ఉద్దేశించి అన‌రాని మాట‌ల‌న్నారు. చివ‌ర‌కు నాటి ప్ర‌ధాని వాజ్‌పాయ్ క‌లుగజేసుకున్న త‌ర్వాత నోరు మూసుకున్న ప‌రిస్థితి. ఇప్పుడ‌దే పెద్దమ‌నిషి... సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెన‌కేసుకొస్తున్నారు. దేశ‌మంతా ఆయ‌న రాజీనామాను డిమాండ్ చేస్తున్నా... ఈయ‌న మాత్రం జ్ఞానేశ్‌ను చంక‌నెత్తుకుని తిరుగుతున్నారు. ఇదే క‌దా అస‌లు మ‌త‌ల‌బు...

- బి.వి.య‌న్‌.ప‌ద్మ‌రాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్