Magazines

సీజ‌న్ స్టార్ట్‌...

1 గంట క్రితం

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

మొన్న‌నే వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు ముగిశాయి. నిమ‌జ్జ‌నాలు పూర్త‌య్యాయి. హ‌మ్మ‌య్యా.. అనుకునేలోపే త‌ల్లిదండ్రుల గుండెలు గుభేల్ మ‌నేలా... ఇదిగిదిగో మేం వ‌స్తున్నామంటూ ద‌స‌రా సెల‌వులు ముందుకొచ్చాయి. ఈనెల 10 నుంచి 21 వ‌ర‌కు ఆ సెల‌వులు కొన‌సాగ‌నున్నాయి. పండ‌గంటే.. అదీ ద‌స‌రా అంటే తెలంగాణ‌కు పెద్ద పండుగ‌. ఒక‌టే సంద‌డి. రాష్ట్ర‌మంతా బ‌తుక‌మ్మ సంబురాలు, న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌తో మార్మోగిపోతుంది. పిల్లాజెల్లాతో ఊళ్ల‌న్నీ సంద‌డిగా ఉంటాయి. రెండు వారాల పాటు ఈ జోష్ కొన‌సాగుతుంది. కానీ ఈ హుషార్‌ను ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నా మంటున్నారు జ‌నాలు. పెరుగు తున్ననిత్యావ‌స‌రాల ధ‌ర‌లు వంటింట్లో కుంప‌ట్ల‌ను ర‌గులుస్తున్నాయి. ప‌ప్పుల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతుండ‌గా, నూనెల రేట్లు స‌ల‌స‌ల‌మంటున్నాయి. గ్యాస్ స‌బ్స‌డీని నానాటికీ కుదిస్తుండ‌టంతో పొయ్యిని వెలిగించాలంటేనే వెనుకా ముందూ ఆలోచించాల్సిన ప‌రిస్థితి. క‌రువు ప‌రిస్థితుల నేప‌థ్యంలో బియ్యం ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో పండ‌గ‌ను ఎలా ప్రారంభించాలి? ఎలా ముగించాలో తెలియ‌క సామాన్యుడు విల‌విల్లాడిపోతున్నాడు. కేవ‌లం ఆహార ప‌దార్థాల ఖ‌ర్చులే కాదు.. పండ‌గంటే కొత్త దుస్తుల కొనుగోళ్లు, ప్ర‌యాణ ఖ‌ర్చులు త‌డిసిమోపెడు కానుండ‌టంతో వాట‌న్నింటినీ ఎలా నెగ్గుకు రావాలంటున్నారు జ‌నం. ద‌స‌రా ముగిసిన త‌ర్వాత వ‌ర‌స‌గా దీపావ‌ళి, ఆ త‌ర్వాత కొత్త సంవ‌త్స‌రం, ఆ పైన సంక్రాంతి... ఇలా పండ‌గ‌ల సీజ‌న్ స్టార్ట్‌... మ‌రి వీట‌న్నింటినీ ఎలా భ‌రిస్తాడో స‌గ‌టు జీవి...
-కే.న‌ర‌హ‌రి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్