Tuesday, August 4, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆహారం వికటించి 
25 మంది విద్యార్థులకు అస్వస్థత

ఆహారం వికటించి 
25 మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -


వర్ధన్నపేట గిరిజన బాలికల 
ఆశ్రమ పాఠశాలలో ఘటన
మెరుగైన వైద్యం అందించాలి :
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
నవతెలంగాణ-రాయపర్తి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు 25మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే వారిని ఆశ్రమ పాఠశాల సిబ్బంది వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ నారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, ఎదురైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయసాగర్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత అధికారులతో కలిసి ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టినట్టు చెప్పారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆహారం వికటించడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆస్పత్రికి తరలించిన 25మంది విద్యార్థినులకు వెంటనే వైద్య సేవలు ప్రారంభించామని, వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన మందులు, సెలైన్, ఇతర చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థినుల పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు.

విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
విద్యార్థినులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్‌తో కలిసి సోమవారం ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో కోలుకునే వరకు వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను గుర్తించి సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే హాస్టల్‌ను స్వయంగా సందర్శించి అక్కడి ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, ఇతర వసతులను పరిశీలిస్తానని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మెన్ పాలకుర్తి సారంగపాణి, సొసైటీ చైర్మెన్ రాజేష్ ఖన్నా తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -