Monday, July 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త మిస్టిక్ థ్రిల్లర్

సరికొత్త మిస్టిక్ థ్రిల్లర్

- Advertisement -

హైదరాబాద్ నగరానికే కాదు… యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక మహా పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయం. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో తన ప్రచార ప్రయాణాన్ని ప్రారంభించింది దర్శక, నిర్మాత ఎం.ఎస్. రాజు రూపొం దించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్ పతాకం పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14, 2026న భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఆదివారం ‘అగధ’ మూవీ టీమ్ బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి, అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించింది. అనంతరం అక్కడే ‘అగధ’ చిత్ర ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించింది.
ఈ సందర్భంగా నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ,’ఈ మధ్య కాలంలో ఈ తరహా డివైన్ మిస్టిక్ థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది మా చిత్రం. ఒక్క పోస్టర్, టీజర్ తోనే సెన్సేషన్ సృష్టించింది. ఎంఎస్ రాజు నిర్మాతగా తీసిన ‘ దేవి’ చిత్రం అన్ని భాష ల్లోనూ, అన్ని ఏరియాల్లోనూ ఒక చరిత్ర సృష్టించింది. ఆ వైబ్స్ ఇప్పుడు ఈ సినిమా విషయంలోనూ కనిపిస్తు న్నాయిఅని తెలిపారు. 'కొంత అమ్మ వారి మీద బేస్ అయిన కథ ‘అగధ’. హైరేంజ్ బడ్జెట్ సినిమాల తరహాలోనే దీన్ని కూడా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. సినిమా ట్రైలర్ ను త్వరలో విడుదల చేస్తాంఅని దర్శకుడు ఎంఎస్ రాజు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -