- Advertisement -
నిధి అగర్వాల్ కథానాయికగా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని సోమవారం ఘనంగా లాంచ్ చేశారు. మైథాలజీ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాత. ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దర్శకుడు పవర్ఫుల్ కథ ని సిద్ధం చేశారు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.
- Advertisement -



