Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగుర్తుండిపోయే సినిమా

గుర్తుండిపోయే సినిమా

- Advertisement -

నిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న సినిమా ‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు). శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ‘ఈ సినిమా పోస్టర్ మీద ‘ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని వేశారు. ఇది కంటెంట్ మీద నమ్మకంతో మేకర్స్ వేశారు. ఈ సినిమా నేను చూశాను. చాలా బాగుంది. ఇది చాలా మంచి సినిమా. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమా నిర్మాత కొత్త వాళ్లని ప్రోత్సహిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాకి థియేటర్లలో మంచి ప్రశంసలు వస్తాయని నమ్ముతున్నాను. డైరెక్టర్ చాలా మంచి కంటెంట్ రాసుకున్నాడు. అంతే అద్భుతంగా తీశాడు. ఈ సినిమా చాలా కాంపిటీషన్‌లో వస్తుంది. అయితే ధైర్యంతో, కంటెంట్ మీద నమ్మకంతో వస్తున్నారు’ అని అన్నారు. ‘ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న వస్తోంది.

చాలా సినిమాలు వస్తున్నాయి. దాంతోపాటు ఈ సినిమా కూడా వస్తుంది. కంటెంట్ మీద నమ్మకంతో సినిమాని రిలీజ్ చేస్తున్నారు’ అని నిర్మాత వంశీ నందిపాటి చెప్పారు. హీరో శివకుమార్ మాట్లాడుతూ,‘ఒక అద్భుతమైన సినిమా మీరు థియేటర్లలో చూడబోతున్నారు. మీరు ఎంత అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా అందు కుంటుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా చూసిన తర్వాత ఎంత మంచి సినిమా తీశామని మీరు అనుకుంటారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయితే నేను అమీర్‌పేట్ సెంటర్‌లో నిల్చుని గుండు గీయించుకుంటాను. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీశాం. అంత నమ్మకంగా ఉన్నాం ’ అని హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -