అల్లరి నరేష్ నటిస్తున్న నయా ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ, ‘మా టీజర్‌కి, ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్. థియేటర్‌లో ఈ సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది. అల్లరి నరేష్ తో నటించడం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది’ అని తెలిపారు. ‘ఈ సాంగ్‌కి అందరూ డాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఈ పాట నచ్చుతుంది. ఈ సినిమాని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రిషా సింగ్ చెప్పారు.
విష్ణుప్రియ మాట్లాడుతూ,‘ఈ పాట మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్‌లో ఈ పాట మీ అందరినీ సీట్లో నుంచి లేచి డాన్స్ చేసేలా చేస్తుంది. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘రంభ ఊర్వశి మేనక’ చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటివరకు రంభ, ఊర్వశి, మేనకలను ఒక డాన్స్‌కి లేకపోతే ఒక సన్నివేశానికి రావడం చూశాము. కానీ ఈ కథ మాత్రం రంభ, ఊర్వశి, మేనకల చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ అడిరిపోతుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు.
అందరికీ కనెక్ట్ అయ్యే కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



