హీరో నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. #కింగ్ 100 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో దర్శ కుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
ఈనెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవు తున్నారు. తమ అభిమాన హీరో 100వ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి చిత్రాల్లో నాగార్జునతో కలిసి నటించిన ఆమె చాలా కాలం తర్వాత మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాపై అంచనాలను పెంచింది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తో పాటు సినిమాకు సంబం ధించిన మరిన్ని వివరాలను కూడా మేకర్స్ వెల్లడించనున్నారు. ‘నాగార్జున పుట్టినరోజుకు మరో 3 రోజులు మాత్రమే ఉండటంతో టైటిల్ గ్లింప్స్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది. నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ సినిమా ఇది. గతంలో ఆయన నటించిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఆద్యంతం వైవిధ్యభరితంగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలం’ అని మేకర్స్ అన్నారు.
అభిమానులకు సర్‌ప్రైజ్ బర్త్‌డే గిప్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



