Tuesday, August 4, 2026
E-PAPER
Homeసినిమాసర్‌ప్రైజ్ చేసే సినిమా

సర్‌ప్రైజ్ చేసే సినిమా

- Advertisement -


నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్‌ ఎల్‌ వి సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా కింగ్ – జాకీ – క్వీన్. 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ‘దసరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు.
వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు కిరణ్ కి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఈ చిత్రం ఈనెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ,‘నేను చేసిన ప్రతి సినిమాను మీరు ఎంతగానో ఆదరించారు. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఒక ఎక్సైట్మెంట్, ఒక భయం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా బాధగా ఉంది. సినిమా విడుదల సమయంలో దర్శకుడు మన మధ్య లేకపోవడం. సినిమా తండ్రి లేని కొడుకులా అనిపి స్తోంది. సినిమా గురించి ఏదైనా అడగాలన్నా, ఏదైనా తెలుసుకోవాలన్నా ఎవరిని అడగాలనే ప్రశ్న మా టీమ్ అందరిలో ఉంది. అయితే శ్రీకాంత్, నిర్మాత సుధాకర్ మాకు అండగా నిలబడ్డారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కింగ్, జాకీ, క్వీన్ పాత్రలు మీకు గుర్తుండిపోతాయి. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.
‘ఇది చాలా మంచి సినిమా. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే చిత్రమిది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది. డెఫినెట్‌గా థియేటర్‌లో చూసి మీ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి. కిరణ్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన విజన్‌ను తెరపైకి తీసుకురావడానికి మేమంతా ఎంతో ప్యాషన్‌తో పని చేశాం. సినిమా చూస్తున్నంతసేపూ మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని హీరో శశి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -