Saturday, August 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజన నేతకు కన్నీటి వీడ్కోలు

జన నేతకు కన్నీటి వీడ్కోలు

- Advertisement -

పెద్ది సుదర్శన్‌‌రెడ్డి అంతిమ యాత్రకు
 వేలాది జనం
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
మంత్రి సీతక్క, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు నివాళి


నవతెలంగాణ-నర్సంపేట

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి శుక్రవారం జనం కన్నీటి వీడ్కోలు పలికారు. అధికార లాంఛనాల మధ్య ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ నెల 26న గుండెపోటుతో హనుమకొండలోని రోహిణి ఆస్పత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి శుక్రవారం అర్ధరాత్రి12:30 గంటలకు మరణించినట్టు వైద్యులు తెలిపారు. అక్కడి నుంచి ఆయన భౌతికకాయాన్ని హనుమకొండ మీదుగా నర్సంపేటకు తీసుకొచ్చారు. వరంగల్‌-నర్సంపేట ప్రధాన రహదారిపై అడుగడుగునా పెద్దికి జనం నివాళులర్పించారు. గిర్నిబావి సెంటర్ నుంచి నర్సంపేట వరకు 10 కిలో మీటర్ల వరకు రోడ్డుపై అంతిమ యాత్ర జనసందోహంతో కొనసాగింది. పట్టణంలోని అయ్యప్ప గుడి నుంచి ప్రధాన రహదారిపై వేలాది మంది అభిమానుల నడుమ అంతిమ యాత్ర సాగింది. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి ఆయన మృతదేహన్ని తీసుకొచ్చారు.

నివాళులర్పించిన కేటీఆర్, హరీశ్‌‌రావు, మంత్రి సీతక్క
పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికకాయానికి మంత్రి సీతక్క, బీఆర్‌ఎస్ వర్కింగ్ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, సత్యవత్‌రాథోడ్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు పోచంపెల్లి శ్రీనివాసరెడ్డి, గోరెటి వెంకన్న, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అంతిమ యాత్రలో హరీశ్‌‌రావు, కేటీఆర్‌ తదితర బీఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు. వర్షం కురిసినా అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొని పెద్దికి తుది వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించడంతో దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటలకు ఆయన కుమారుడు నిదర్శన్ రెడ్డి చితికి నిప్పంటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -