- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 03-08-2026
- ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ: 30-08-2026
- రూ.1,500 ఆలస్య రుసుముతో: 31-08-2026 నుంచి 05-09-2026 వరకు
- రూ.2,000 ఆలస్య రుసుముతో: 06-09-2026 నుంచి 10-09-2026 వరకు
- రూ.3,000 ఆలస్య రుసుముతో: 11-09-2026 నుంచి 12-09-2026 వరకు
- దరఖాస్తులో మార్పులు (Edit Option): 13-09-2026 నుంచి 15-09-2026 వరకు
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 22-09-2026
- పరీక్షలు: 2026 సెప్టెంబర్ చివరి వారం
- Advertisement -



