Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏకు శంకర్ మాదిగ
నవతెలంగాణ – పరకాల 

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో పశువుల సంత ఎదురుగా నూతనంగా చేపడుతున్న ఇంటి నిర్మాణంపై నిబంధనల ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఏకు శంకర్ మాదిగ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.17వ వార్డులో మామిడి రమేష్ చేపడుతున్న ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు ఉన్నాయా.. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందిందా, ఎన్ని అంతస్తులకు అనుమతి ఇచ్చారు.. ఆమోదిత ప్లాన్ ప్రకారం సెట్‌బ్యాక్‌లు వదిలారా అనే అంశాలను అధికారులు పరిశీలించాలని ఫిర్యాదుదారు కోరారు.

నిర్మాణం మున్సిపల్ భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని, దీనివల్ల భవిష్యత్తులో పరిసర ప్రాంతాల ప్రజలకు గాలి, వెలుతురు, డ్రైనేజీ, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నిర్మాణ అనుమతులు, ఆమోదిత ప్లాన్, సెట్‌బ్యాక్‌లు, నిర్మాణ విస్తీర్ణం, అంతస్తుల సంఖ్య తదితర అంశాలను రికార్డులతో సరిపోల్చి చూడాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉన్నట్లు తేలితే నిర్మాణాన్ని నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని, సమస్యపై చర్యలు తీసుకోని పక్షంలో ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని శంకర్ మాదిగ డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -