Sunday, July 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న అఖిల్ 'లెనిన్'

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న అఖిల్ ‘లెనిన్’

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో అఖిల్ ఊరమాస్ నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

మంచి మౌత్ టాక్ రావడంతో సినిమా వసూళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. “ప్రేక్షకుల మౌత్ టాక్ అద్భుతంగా పనిచేస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37.2 కోట్ల గ్రాస్ సాధించి ‘లెనిన్’ దూసుకుపోతోంది” అంటూ నిర్మాణ సంస్థ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా రూపంలో అది లభించడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -