Magazines

స్పెయిన్‌లో నవంబర్‌ 11న సార్వత్రిక సమ్మె

1 గంట క్రితం

General strike
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

ముందస్తు ఎన్నికల వేళ కార్మిక సంఘాల నిర్ణయం

గృహ సంక్షోభ నివారణకు పలు చర్యలు ప్రకటించిన ప్రభుత్వం


మాడ్రిడ్‌ : స్పెయిన్‌లో వచ్చే నెలలో ముందస్తు ఎన్నికలు జరగనున్న తరుణంలో కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. గృహ సంక్షోభాన్ని పరిష్కరించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండడంతో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రధాని పెడ్రో సాంచెజ్‌ అత్యవసర చట్టాన్ని రూపొందించారు. అయితే దీనికి పార్లమెంట్‌ ఆమోదం లభించకపోవడంతో ఆయన ముందస్తు ఎన్నికలకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. నిర్ణీత గడువు కంటే ఎనిమిది నెలలు ముందుగా...అంటే నవంబర్‌ 29న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికలకు ముందు నవంబర్‌ 11న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 6న రాజధాని మాడ్రిడ్‌లో 87 సంవత్సరాల వృద్ధురాలిని ఆమె ఇంటి నుంచి ఖాళీ చేయించడంతో ఆందోళనలు మొదలయ్యాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం తాజాగా 21 నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కొత్త గృహాలను కొనుగోలు చేయడాన్ని, అద్దెకు తీసుకోవడాన్ని ప్రభుత్వం సులభతరం చేసింది. ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న వారిని ఇళ్లు ఖాళీ చేయించకుండా రక్షణ చర్యలను పొడిగించింది. గదుల అద్దెలపై నియంత్రణ విధించింది. ఇంటిని కేవలం ధరను పెంచాలనే ఉద్దేశంతో కొనుగోలు చేయడాన్ని అడ్డుకోవడంతో పాటు సకాలంలో అద్దె చెల్లించే వారికి పన్ను రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. వృద్ధురాలికి ఎదురైన పరిస్థితి వేరెవ్వరికీ రాకుండా చూస్తామని సాంచెజ్‌ హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్