Magazines

అబద్ధాలకోరువి...అవినీతిపరుడివి

1 గంట క్రితం

you are corrupt.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

చర్చా కార్యక్రమంలో లూలా, బోల్సొనారో మధ్య వాగ్యుద్ధం

సావో పాలో : బ్రెజిల్‌ అధ్యక్ష పదవి కోసం మరో వారం రోజుల్లో రెండో రౌండ్‌ (రన్‌-ఆఫ్‌) ఎన్ని క జరగనున్న తరుణంలో ప్రధాన అభ్యర్థులైన ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా, మితవాద సెనెటర్‌ ఫ్లావియా బోల్సొనారో మధ్య ఆదివారం జరిగిన తొలి చర్చా కార్యక్రమం వాడివేడిగా సాగింది. ఇరువురు నేతలు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. ఒకరినొకరు అబద్ధాల కోరువని, అవినీతిపరుడివని నిదించు కున్నారు. పలు కుంభకోణాలను బయటికి లాగారు. వీరిద్దరి మధ్య పలు అంశాలపై తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. బోల్సొనారోకు అబద్ధాలు చెప్పడం అలవాటని, ఆయన ఓ దుండ గుడని లూలా ఆరోపించారు. రియో డీ జనైరోలోని పారా మిలిటరీ గ్రూపులతో ఆయనకు ఉన్న సంబంధాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బోల్సొనారోను 'మిలీషియా సభ్యుడు' అని సంబోధించారు.

మరోవైపు ఫ్లావియా బోల్సొనారో సమాధాన మిచ్చారు.. 'నా పర్సును దొంగిలించవచ్చు. కాబట్టి లూలాను దూరంగా ఉంచడమే మంచిది' అని అన్నారు. లూలా మాట్లా డుతున్న సమయంలో బోల్సొనారో ఆయన వెనక అటూ ఇటూ తిరుగుతూ, తల ఊపుతూ, వెక్కిరిస్తూ, ఎగతాళిగా నవ్వారు. ఫ్లావియా తండ్రి అయిన పెద్ద బోల్సొనారో ప్రమేయం ఉన్న ఓ అవినీతి కేసు విచారణపై వివరణ ఇవ్వాలని లూలా డిమాండ్‌ చేశారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఫ్లావియా తప్పించుకున్నారు. పైగా లూలా ను విదూషకుడు అఁ పిలిచారు. అధ్యక్షుడి కఁమారులలో ఒకరిపై పెట్టబోయే అవినీతి కేసును ప్రస్తావిస్తూ ఎదురు దాడి చేశారు. చర్చ సందర్భంగా లూలా లేవనెత్తిన అనేక ప్రశ్నలకు బోల్సొనారో సమాధానాన్ని దాటవేశారు. చర్చా కార్య క్రమం యావత్తూ ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే సాగింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్