అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘పళ్ళబురుసు’. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట ‘కొత్త సోకు’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. పల్లె వాతావరణం, జానపద సంగీతం, పండుగ సందడిని ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ పాట సినిమా ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిన ‘కొత్త సోకు’ పాట సరదా సాహిత్యం, ఆకట్టుకునే బీట్‌తో అలరించింది ‘అంగి జూడే… ఆతడి పొంగు జూడే… దోతి రంగు జూడే…’ అనే క్యాచీ హుక్ లైన్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, పళ్ళబురుసు ప్రపంచానికి ఓ అందమైన పరిచయాన్ని ఇస్తోంది. సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటకు పవన్ సీహెచ్ మ్యూజిక్ అందించగా, వాగ్దేవి తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు మరింత ఊపు తీసుకొచ్చారు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
‘అంగి జూడే.. దోతి రంగు జూడే`
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



