నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల రామారావుపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను రెండవ విడతలో ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఎంపికైనట్లుగా మండల విద్యాశాఖ అధికారి జి.లక్ష్మన్ బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. పాఠశాలకు ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్,ఒక ఆయా పోస్టులకు అర్హులైన స్థానికులు ఈనెల 3 సోమవారం నుండి 5బుధవారం సాయంత్రం 3 గంటల వరకు ఎమ్మాశ్రీ కొయ్యుర్ భవనంలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్, ఆయా పోస్టుకు 7వ తరగతి అర్హత ఉన్నవాళ్లు స్థానికులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేవారు టెన్త్, ఇంటర్, ప్రీ ప్రైమరీ బిఈడి, రెసిడెన్సి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో అప్లై చేసుకోవాలన్నారు.
ప్రి ప్రైమరి స్కూల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



