Monday, July 13, 2026
E-PAPER
Homeఆటలుఅర్జెంటీనా అదరహో

అర్జెంటీనా అదరహో

- Advertisement -

సెమీఫైనల్లో మెస్సీ సేన
క్వార్టర్స్‌‌లో స్విస్‌‌పై 3-1తో గెలుపు
ఫిఫా 2026 ప్రపంచకప్‌

కాన్సాస్‌ ‌సిటీ (యుఎస్‌ఏ)
డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ అర్జెంటీనా ఫిఫా 2026 ప్రపంచకప్‌ ‌సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో స్విట్జర్లాండ్‌‌పై 3-1తో అర్జెంటీనా గెలుపొందింది. అలెక్సస్‌ ‌మాక్‌ అలిస్టర్‌ (10‌వ నిమిషం), జులియన్‌ అల్వారెజ్‌ (112వ నిమిషం), లాటారో మార్టినెజ్‌ (120+1వ నిమిషం) అర్జెంటీనాకు గోల్స్‌ ‌కొట్టారు. స్విట్జర్లాండ్‌ ‌తరఫున డాన్‌ ‌నోయె (67వ నిమిషం) ఓ గోల్‌ ‌కొట్టాడు. క్వార్టర్స్‌‌లో ఓటమితో స్విట్జర్లాండ్‌ ‌టోర్నమెంట్‌ ‌నుంచి నిష్క్రమించగా.. త్రీ లయన్స్‌ (ఇంగ్లాండ్‌)‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా ‌సెమీఫైనల్లో తలపడనుంది. లియోనల్‌ ‌మెస్సీ తొలిసారి ఇంగ్లాండ్‌‌తో తలపడనున్నాడు.

​మెస్సీ సేన మేనియా
క్వార్టర్‌‌ఫైనల్లో ఫేవరేట్‌‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. అంచనాలను అందుకునే ప్రదర్శన చేసింది. లియోనల్‌ ‌మెస్సీపై స్విట్జర్లాండ్‌ ‌డిఫెన్స్‌ ‌ఫోకస్‌ ‌పెట్టగా.. సహచరులకు గోల్‌ అవకాశాలు సృష్టించే పనిలో మెస్సీ పడ్డాడు. 10వ నిమిషంలో మెస్సీ కార్నర్‌ ‌కిక్‌‌ను స్విస్‌ ఆటగాళ్ల కంటే ఎత్తులో ఎగురుతూ మాక్‌ అలిస్టర్‌ ‌హెడర్‌ ‌గోల్‌‌గా మలిచాడు. అర్జెంటీనా పదో నిమిషంలోనే 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రథమార్థంలో అర్జెంటీనా మరిన్ని ప్రయత్నాలు చేసిన మరో గోల్‌ ‌దక్కలేదు. ద్వితీయార్థంలో స్విట్జర్లాండ్‌ ఆటగాడు డాన్‌ ఓ గోల్‌ ‌చేశాడు. పెనాల్టీ ఏరియా లోపల నుంచి అందంగా బంతిని గోల్‌‌పోస్ట్‌‌లోకి పంపించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. 90 నిమిషాల ఆటకు తోడు ఇంజూరీ టైమ్‌‌లోనూ ఇరు జట్లు గోల్‌ ‌చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారితీసింది. అంతకుముందే (72వ నిమిషంలో) బీల్‌ ఎంబోలో రెండు ఎల్డో కార్డ్‌‌లు అందుకున్న ఫలితంగా ఆటోమెటిక్‌ ‌రెడ్‌ ‌కార్డ్‌‌తో మైదానం వీడాడు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ పది మందితోనే పోరాడింది. ఎక్స్‌‌ట్రా టైమ్‌‌లో అల్వారెజ్‌ ‌పెనాల్టీ ఏరియా బయటి నుంచి కుడి కాలు కిక్‌‌తో బంతిని గోల్‌‌పోస్ట్‌‌లోకి పంపించాడు. మలుపులు తిరుగుతూ బంతి గోల్‌‌పోస్ట్‌‌లో పడగా అర్జెంటీనా 2-1తో ముందంజ వేసింది. అదనపు సమయం ఇంజూరీ టైమ్‌‌లో మార్టినెజ్‌ ‌మెరుపు గోల్‌ ‌కొట్టాడు.

మరో ఎండ్‌‌ను బంతితో పెనాల్టీ ఏరియాలోకి వచ్చిన లోపెజ్‌‌ను గోల్‌ ‌కీపర్‌‌గా నిలువరించాడు. కానీ బంతి ఈ సమయంలో మార్టినెజ్‌‌కు చిక్కటంతో తెలివిగా గోల్‌‌గా మలిచాడు. 3-1తో అర్జెంటీనా తిరుగులేని ఆధిక్యం సాధించింది. క్వార్టర్‌‌ఫైనల్లో స్విట్జర్లాండ్‌‌పై మెరుపు విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌‌లో లియోనల్‌ మెస్సీ తొలిసారి గోల్‌ ‌కొట్టలేదు. అయినా, ఎనిమిది గోల్స్‌‌తో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ అర్జెంటీనా ఫిఫా 2026 ప్రపంచకప్‌ ‌సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో స్విట్జర్లాండ్‌‌పై 3-1తో అర్జెంటీనా గెలుపొందింది. అలెక్సస్‌ ‌మాక్‌ అలిస్టర్‌ (10‌వ నిమిషం), జులియన్‌ అల్వారెజ్‌ (112వ నిమిషం), లాటారో మార్టినెజ్‌ (120+1వ నిమిషం) అర్జెంటీనాకు గోల్స్‌ ‌కొట్టారు. స్విట్జర్లాండ్‌ ‌తరఫున డాన్‌ ‌నోయె (67వ నిమిషం) ఓ గోల్‌ ‌కొట్టాడు. క్వార్టర్స్‌‌లో ఓటమితో స్విట్జర్లాండ్‌ ‌టోర్నమెంట్‌ ‌నుంచి నిష్క్రమించగా.. త్రీ లయన్స్‌ (ఇంగ్లాండ్‌)‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా ‌సెమీఫైనల్లో తలపడనుంది. లియోనల్‌ ‌మెస్సీ తొలిసారి ఇంగ్లాండ్‌‌తో తలపడనున్నాడు.

​మెస్సీ సేన మేనియా
క్వార్టర్‌‌ఫైనల్లో ఫేవరేట్‌‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. అంచనాలను అందుకునే ప్రదర్శన చేసింది. లియోనల్‌ ‌మెస్సీపై స్విట్జర్లాండ్‌ ‌డిఫెన్స్‌ ‌ఫోకస్‌ ‌పెట్టగా.. సహచరులకు గోల్‌ అవకాశాలు సృష్టించే పనిలో మెస్సీ పడ్డాడు. 10వ నిమిషంలో మెస్సీ కార్నర్‌ ‌కిక్‌‌ను స్విస్‌ ఆటగాళ్ల కంటే ఎత్తులో ఎగురుతూ మాక్‌ అలిస్టర్‌ ‌హెడర్‌ ‌గోల్‌‌గా మలిచాడు. అర్జెంటీనా పదో నిమిషంలోనే 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రథమార్థంలో అర్జెంటీనా మరిన్ని ప్రయత్నాలు చేసిన మరో గోల్‌ ‌దక్కలేదు. ద్వితీయార్థంలో స్విట్జర్లాండ్‌ ఆటగాడు డాన్‌ ఓ గోల్‌ ‌చేశాడు. పెనాల్టీ ఏరియా లోపల నుంచి అందంగా బంతిని గోల్‌‌పోస్ట్‌‌లోకి పంపించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. 90 నిమిషాల ఆటకు తోడు ఇంజూరీ టైమ్‌‌లోనూ ఇరు జట్లు గోల్‌ ‌చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారితీసింది. అంతకుముందే (72వ నిమిషంలో) బీల్‌ ఎంబోలో రెండు ఎల్డో కార్డ్‌‌లు అందుకున్న ఫలితంగా ఆటోమెటిక్‌ ‌రెడ్‌ ‌కార్డ్‌‌తో మైదానం వీడాడు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ పది మందితోనే పోరాడింది. ఎక్స్‌‌ట్రా టైమ్‌‌లో అల్వారెజ్‌ ‌పెనాల్టీ ఏరియా బయటి నుంచి కుడి కాలు కిక్‌‌తో బంతిని గోల్‌‌పోస్ట్‌‌లోకి పంపించాడు. మలుపులు తిరుగుతూ బంతి గోల్‌‌పోస్ట్‌‌లో పడగా అర్జెంటీనా 2-1తో ముందంజ వేసింది. అదనపు సమయం ఇంజూరీ టైమ్‌‌లో మార్టినెజ్‌ ‌మెరుపు గోల్‌ ‌కొట్టాడు. మరో ఎండ్‌‌ను బంతితో పెనాల్టీ ఏరియాలోకి వచ్చిన లోపెజ్‌‌ను గోల్‌ ‌కీపర్‌‌గా నిలువరించాడు. కానీ బంతి ఈ సమయంలో మార్టినెజ్‌‌కు చిక్కటంతో తెలివిగా గోల్‌‌గా మలిచాడు. 3-1తో అర్జెంటీనా తిరుగులేని ఆధిక్యం సాధించింది. క్వార్టర్‌‌ఫైనల్లో స్విట్జర్లాండ్‌‌పై మెరుపు విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌‌లో లియోనల్‌ మెస్సీ తొలిసారి గోల్‌ ‌కొట్టలేదు. అయినా, ఎనిమిది గోల్స్‌‌తో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -