Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో ఆషాడమాస బోనాలు ప్రారంభం

మద్నూర్ లో ఆషాడమాస బోనాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి బేడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో జరుపుకునే బోనాల పండుగ ఆదివారం నుండి ప్రారంభమైంది. ఈ పండుగను గ్రామ ప్రజలు బేడల వారీగా జరుపుకుంటారు. గ్రామంలో ఈ నెల నాలుగున మంగళవారం గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ఒకే రోజున బోనాల పండుగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల రెండున ఆదివారం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి బేడాయన ముదిరాజ్ సంఘం కులస్తులంతా ఈ బోనాల పండుగను అంగరంగ వైభోగంగా ఉత్సవంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు జరిపి మేకలను బలి ఇచ్చారు. ఈ బోనాల పండుగకు ముఖ్యంగా మహిళలు, పురుషులు యువతీ యువకులు చిన్నారులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -