ఆంధ్ర జట్టుతో హైదరాబాద్ ఢీ
నవతెలంగాణ-హైదరాబాద్ :
ఓ వైపు ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ జరుగుతుండగా.. బ్యాకప్ క్రికెటర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. హైదరాబాద్ ఎమర్జింగ్ ప్రీమియర్ లీగ్ (హెచ్‌ఈపీఎల్) 2026-27ను ఆదివారం ప్రకటించింది. ఈ లీగ్‌లో భాగంగా హైదరాబాద్ ఏ, బీ జట్లు రెడ్‌బాల్ ఫార్మాట్‌లో(నాలుగు రోజులు) మూడు మ్యాచ్‌లు ఆడనుండగా.. హైదరాబాద్ ఎమర్జింగ్ టీమ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జట్టుతో తలపడనుంది. ఈ మేరకు హైదరాబాద్ ఎమర్జింగ్ టీమ్‌తో పాటు టీమ్-ఏ, టీమ్-బిలను హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది.
హైదరాబాద్ ఎమర్జింగ్ టీమ్ : ప్రణవ్ సూర్యదేవర, రితేశ్ రెడ్డి, యశ్ (వికెట్ కీపర్), హృషికేశ్ సింహా, భవేశ్ సేతు (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), టి రవితేజ (కెప్టెన్), కార్తికేయ కక్, హుస్సేన్, హర్షిత్ సాయి, కులకర్ణి, ఊర్వేశ్, ఘాజి అబ్బాస్, గడుగు గణేష్, పృథ్వీ రెడ్డి.







కామెంట్‌లు (0)