నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) వేదికగా జరిగిన జాతీయ జూనియర్ ఈక్వెస్ర్టియన్ అర్హత పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఆదివారం జరిగిన షో జంపింగ్ పోటీల్లో 100-105 సెమీ విభాగంలో సౌర్యారమ్ ఇందుకూరి (హ్యాపీనెస్) విజేతగా నిలువగా, ఈషన్ భరద్వాజ్, ప్రభునూర్ సింగ్ తర్వాతి స్థానాలు సాధించారు. షో జంపింగ్ 40 సెమీ (అండర్-12) విభాగంలో నాగ్ హృదాన్ ములుగు (కింగ్) అగ్రస్థానంలో నిలువగా.. అన్య రాథి, ఖాజా కసీఫుద్దీన్ టాప్-3లో ఉన్నారు. షో జంపింగ్ 40 సెమీ ఓపెన్ విభాగంలో జగదీశ్ ఆర్చి (పవర్), తిరుమల్ (గుడ్ లక్), పండరీకాక్ష (గ్లోరీ) టాప్-3 స్థానాలు సాధించారు. తెలంగాణ స్టేట్ ఈక్వెస్ర్టియన్ అసోసియేషన్ రఘు పంచకర్ల, హెచ్పీఆర్సీ చైతన్య ఆర్ కుమార్లు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో రాణించిన రైడర్లు ఈ ఏడాది ఆఖర్లో జరిగే జాతీయ జూనియర్ ఈక్వెస్ర్టియన్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
ముగిసిన జాతీయ ఈక్వెస్ర్టియన్ అర్హత పోటీలు
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)